పెద్ది విడుదల.. శ్రీవారి సేవలో హీరోయిన్‌ జాన్వీ కపూర్‌

  • రామ్‌ చరణ్‌ సరసన కనిపించిన జాన్వీ కపూర్‌
  • డైరెక్టర్‌గా బుచ్చిబాబు సానా
  • సంప్రదాయబద్ధంగా పట్టుచీరలో శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ
  • గుడి ముందు సాష్టాంగ నమస్కారం
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ జంటగా నటించిన సినిమా ‘పెద్ది’ ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. ఈ చిత్రం విడుదల సందర్భంగా కథానాయిక జాన్వీ కపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ముదురు రంగు పట్టుచీర కట్టుకుని సంప్రదాయబద్ధంగా కనిపించింది. బంగారు కామన్‌పట్టీ, నెక్లెస్, జుంకాలు, చేతులకు గాజులు ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దర్శనం అనంతరం ఆలయం నుంచి బయటకు వస్తూ ప్రధాన ద్వారం వద్ద శ్రీవారికి సాష్టాంగ నమస్కారం చేసింది.

‘పెద్ది’ సినిమాకు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో బొమన్ ఇరానీ, శివరాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు కీలక పాత్రల్లో కనిపించారు. ఇందులో రామ్ చరణ్ ఒక క్రాస్‌ఓవర్ అథ్లెట్‌గా కనిపించాడు. అతడు క్రికెట్, కుస్తీ వంటి క్రీడల్లో రాణించే యువకుడిగా అలరించాడు. పల్లెటూరి నేపథ్యంతో సాగే ఈ కథలో ఓ పట్టుదల గల యువకుడు క్రీడా పోటీల ద్వారా ఎలా పైకి వచ్చాడనేది చూపించారు. నిన్న సాయంత్రమే ప్రారంభమైన ప్రీమియర్‌ షోలతో ఈ సినిమా పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది.

Janhvi Kapoor
Tirumala
Tirupati
Peddi
Srivari Temple
Ram Charan

More Telugu News